ఆక్సిజన్ అందక కరోనా రోగి మృతి చెందాడని.. అతని బంధువులు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కొవిడ్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అమలాపురంలోని శ్రీనిధి ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా అధికారులు గుర్తించారు.
అక్కడికి చికిత్స కోసం వెళ్లిన తమ బంధువు ఆక్సిజన్ అందక చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అయినవిల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగుమల్ల కాశి అన్నపూర్ణ భర్త శ్రీనివాసరావు తదితరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: