న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జేఎన్టీయూ ఒప్పంద అధ్యాపకుడు ఆందోళన నిర్వహించారు. ఉప కులపతి రామలింగరాజు ఛాంబర్లో సహ అధ్యాపకులతో కలసి బైఠాయించారు. ఒప్పంద అధ్యాపకులను తొలగించకూడదనే కోర్టు ఆదేశమున్నప్పటికీ తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పర్యావరణ శాస్త్ర అధ్యాపకుడు సుధీర్ ఆరోపించారు. మే నెలలో 18మంది అధ్యాపకులను తొలగించినందుకు వారి తరపున పోరాడానని... ఆ కక్షతోనే తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు కళాశాలకు వస్తున్నప్పటికీ 4నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వెంటనే తనను విధుల్లోకి తీసుకుని జీతం బకాయిలు విడుదల చేసేవరకూ ఆందోళన విరమించేది లేదన్నారు. ఉప కులపతి నియామకం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వీసీ రామలింగరాజును వివరణ కోరగా... పని తక్కువగా ఉన్నందున కొంతమందిని తొలగించాలని మే నెలలో భావించామన్నారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వంటి పెద్దల విజ్ఞప్తితో వారిని విధుల్లో కొనసాగిస్తున్నామని చెప్పారు. సుధీర్ పని చేసే విభాగంలో వర్క్ లోడ్ లేనందున విధులకు తీసుకోవడానికి ప్రిన్సిపల్ నిరాకరించారని తెలిపారు. బుధవారం నాటికి ఈ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కాకినాడ జేఎన్టీయూలో ఒప్పంద అధ్యాపకుల ఆందోళన - protest
నాలుగు నెలలుగా ప్రతి రోజూ కళాశాలకు వస్తున్నప్పటికీ తనకు జీతం ఇవ్వడం లేదని కాకినాడ జేఎన్టీయూలో ఓ ఒప్పంద అధ్యాపకుడు ఆందోళన చేశారు. పాత విషయాలను మనసులో పెట్టుకుని కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జేఎన్టీయూ ఒప్పంద అధ్యాపకుడు ఆందోళన నిర్వహించారు. ఉప కులపతి రామలింగరాజు ఛాంబర్లో సహ అధ్యాపకులతో కలసి బైఠాయించారు. ఒప్పంద అధ్యాపకులను తొలగించకూడదనే కోర్టు ఆదేశమున్నప్పటికీ తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పర్యావరణ శాస్త్ర అధ్యాపకుడు సుధీర్ ఆరోపించారు. మే నెలలో 18మంది అధ్యాపకులను తొలగించినందుకు వారి తరపున పోరాడానని... ఆ కక్షతోనే తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు కళాశాలకు వస్తున్నప్పటికీ 4నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వెంటనే తనను విధుల్లోకి తీసుకుని జీతం బకాయిలు విడుదల చేసేవరకూ ఆందోళన విరమించేది లేదన్నారు. ఉప కులపతి నియామకం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వీసీ రామలింగరాజును వివరణ కోరగా... పని తక్కువగా ఉన్నందున కొంతమందిని తొలగించాలని మే నెలలో భావించామన్నారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వంటి పెద్దల విజ్ఞప్తితో వారిని విధుల్లో కొనసాగిస్తున్నామని చెప్పారు. సుధీర్ పని చేసే విభాగంలో వర్క్ లోడ్ లేనందున విధులకు తీసుకోవడానికి ప్రిన్సిపల్ నిరాకరించారని తెలిపారు. బుధవారం నాటికి ఈ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
~~~~~~~~~~~~~|||*
పరిహారం కోసం రైతులు గ్రీన్ కో గాలిమరల కంపెనీ వద్ద ఆందోళన
~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రీన్ కో గాలిమరల కంపెనీ రైతుల పొలాల్లో విద్యుత్ స్తంభాలు పూడ్చి ఒక్కో స్తంభానికి రూ.12వేల నుంచి రూ 20వేల వరకు ఒప్పందం కుదుర్చుకున్న ది.అయితే విద్యుత్ స్తంభాలు పూడ్చి నెలలు గడిచినా పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు కళ్యాణదుర్గం పట్టణంలో ని గ్రీన్ కో కంపెనీ వద్ద ఆందోళన చేపట్టారు. పరిహారం మంజూరు లో కూడా అవకతవకలు జారిగాయని దళారులు ప్రమేయం లేకుండా పరిహారం అందిచాలని డిమాండ్ చేశారు.కంపెనీ ప్రతినిధి రవికాంత్ పరిహారం వెంటనే అందించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా