ప్రభుత్వ మద్యం షాపులలో పని చేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్మ్యాన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆందోళన చేశారు. అనంతరం సీఐ రాంబాబు, స్థానిక ఎమ్మార్వో కృష్ణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. మద్యపాన నిషేధంలో భాగంగా 13% దుకాణాలు తగ్గించడంతో అందులో పనిచేస్తున్న వారు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి స్పందించి.. తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మద్యపాన నిషేధానికి తమ మద్దతు ఉంటుందన్నారు.
ఇదీచదవండి.