Bridges Damaged in Godavari districts: ఊచలు తేలిపోయి.. మొక్కలు మొలిచి.. కొన్ని చోట్ల ఒరిగిపోయి ప్రమాదకర స్థితిలో ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే రాజమహేంద్రవరం రైలు-రోడ్డు వంతెన రక్షణ గోడ! ..రైళ్ల రాకపోకల సమయంలో కుదుపులకు రక్షణ గోడ బీటలు వారి పెచ్చులూడి కింద పడుతున్నాయి. రహదారి-రక్షణ గోడ మధ్య ఖాళీలు ఏర్పడ్డాయి.
Concern over Protection of Bridges: నిత్యం రద్దీగా ఉండే ఈ వంతెన రక్షణ గోడలను శాశ్వత ప్రాతిపదికన పటిష్ఠ పరచాలని వాహన చోదకులు కోరుతున్నారు. ఈ విషయాన్ని డీఈ మధుసూదనరావు వద్ద ప్రస్తావించగా ప్యాచ్ వర్కు కోసం రూ.12 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే మరమ్మతులు చేపడతామన్నారు.


