ETV Bharat / state

తుని వీధుల్లో రసాయన ద్రావణం పిచికారి

తుని పట్టణంలో రెండు రోజులు పూర్తి లాక్​డౌన్ ప్రకటించారు. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పురపాలక కమిషనర్ ప్రసాదరాజు సూచించారు. రసాయన ద్రావణాన్ని పట్టణ వీధుల్లో పిచికారి చేయనున్నట్లు వెల్లడించారు.

complete lock down in tuni
రెండు రోజులు తుని పట్టణం పూర్తి లాక్​డౌన్ అమలు
author img

By

Published : Mar 28, 2020, 10:43 AM IST

తునిలో రెండు రోజులు పూర్తి లాక్​డౌన్

కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా తునిలో అధికారులు మరింత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో శని, ఆదివారాల్లో పూర్తిగా లాక్​డౌన్ ప్రకటించినట్లు తుని పురపాలక కమిషనర్ ప్రసాదరాజు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉదయం సమయంలో అనుమతి ఉందని తెలిపారు. ఈ రెండు రోజుల్లో తుని పట్టణ వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయనున్నట్లు ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు. ప్రజలంతా అధికారులకు సహకరించి, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్: విద్యార్థులు, ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.