ETV Bharat / state

కొబ్బరికి కరోనా దెబ్బ

ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి వ్యాపార రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం ధర బాగానే ఉన్నా కొనే వారు లేరు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. రైతులతో పాటు ఎగుమతిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

author img

By

Published : Apr 6, 2020, 10:00 AM IST

గోదావరి జిల్లాలో కొబ్బరికి కరోనా దెబ్బ
గోదావరి జిల్లాలో కొబ్బరికి కరోనా దెబ్బ

కొబ్బరి పంటకు తూర్పు గోదావరి జిల్లా పెట్టింది పేరు. జిల్లాలో 22,228 హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. రోజూ జిల్లా నుంచి 200 లారీలకు పైగా ఎగుమతులు జరిగేవి. అందులో సగం పాలకొల్లు నుంచే ఉండేది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. ఛత్తీస్ గఢ్ లో ప్రతి పండుగకు కొబ్బరి ఎగుమతులు పెద్ద ఎత్తున జరుగతుంటాయి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో అన్ని ప్రాంతాలకు కొబ్బరి ఎగుమతులు నిలచిపోయాయి. జిల్లాలో సుమారు 3 కోట్ల కొబ్బరికాయల నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా.

ధర బాగానే ఉన్నా..

జనతా కర్ఫ్యూ ముందు రోజు వరకు పెద్దవి రూ. 13, చిన్నవి రూ. 6 నుంచి రూ. 8 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. 21 వ తేది నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతు స్తంభించగా రైతుల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయి. తక్కవ ధరకైనా అమ్ముదామంటే కొనేవాళ్లెవరూ లేకపోవటంతో రైతులు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

ఉపాధి కొల్పోయిన కార్మికులు

కొబ్బరి వ్యాపార రంగంపై ఆధారపడి లక్షల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. కొబ్బరి దింపు, ఒలుపు, ఎగుమతి, దిగుమతులు, కాయలను గ్రేడింగు చేసే కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం సంక్షభ ప్రభావం వీరందరిపై తీవ్రంగా పడింది. పనులు లేనందున కార్మికులు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇతర పనులకు వెళదామన్నా అవీ లేక ఏం చేయాలో తెలియని పరిస్థితి అనుభవిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే బతుకేలా అని అందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

ఇన్నాళ్లకు.. రాంబంటు కడుపు నిండింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.