తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అసెంబ్లీ లోక్ సభ స్థానం పరిధిలోని7 అసెంబ్లీ నియోజకవర్గాల తెదేపానేతలతో అధినేతచంద్రబాబు సమావేశమయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశిస్తున్న నేతలతో మంతనాలు జరిపారు.కాకినాడ లోక్సభ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఈ స్థానంలో ప్రస్తుత ఎంపీగా ఉన్న తోట నరసింహం అనారోగ్య కారణాలతో పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు. అందుకు బదులుగా కుటుంబసభ్యులకు జగ్గంపేట టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబును అడిగినట్టు సమాచారం. ఒకవేళ జగ్గంపేట సీటు ఇవ్వకపోతే పిఠాపురం స్థానమైనా ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మండలి సభ్యునిగా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తుని అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నట్టు సమాచారం. కాకినాడ పట్టణ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబు మళ్లీటికెట్ ఆశిస్తున్నారు. గ్రామీణ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కూడా టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ప్రస్తుత స్థానం నుంచే పోటీకి సుముఖంగా ఉన్నట్టు సమాచారం.
జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నారు. పిఠాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా వర్మ ఉన్నారు.త్తిపాడు స్థానంలో టికెట్ కోసం వరుపుల సుబ్బారావు, వరుపుల రాజా పోటీపడుతున్నారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్పష్టత రానుంది.