జల వనరులు, పర్యాటకశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. బోటు ప్రమాదాలు, తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. బోటు ప్రమాదాల నివారణకు 8 చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్న సీఎం.. కంట్రోల్ రూమ్స్‌లో పోలీసు, జలవనరులు, పర్యాటకశాఖ సిబ్బంది ఉండాలని సూచించారు.
కంట్రోల్ రూంలో ముగ్గురు కానిస్టేబుళ్లతో సహా 13 మంది సిబ్బంది ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి ఈ నెల 21న శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కంట్రోల్ రూమ్స్‌ను 90 రోజుల్లో అందుబాటులోకి తేవాలన్న సీఎం... బోట్ల ప్రయాణ మార్గాలు, వరద ప్రవాహ సమాచారం ముందుగానే తెలుసుకోవాలన్నారు. బోట్లలో మద్యం వినియోగం ఉండకూడదని ఆదేశించారు. బోటు సిబ్బందికీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని బోట్లకు జీపీఎస్ విధానం ఉండాలన్న ముఖ్యమంత్రి.. బోటు ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ రూమ్స్‌కే ఇవ్వాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి :