ETV Bharat / state

వెండి తెర తళుకులు లేక.. గొడౌన్లుగా థియేటర్లు

author img

By

Published : Jul 6, 2020, 3:07 PM IST

వెండి తెరపై చిత్రం ఆడేది ఎప్పుడో అన్న సందేహం నెలకొంది. కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడిన కారణంగా.. యాజమానులు అయోమయ పరిస్థితుల్లో పడ్డారు. థియేటర్లు తెరిచినా... నిర్వహణ ఖర్చులు పెరగటం, ప్రేక్షకుల ఆదరణ అంతంతమాత్రమే ఉంటుందన్న అనుమానాలతో ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి పెడుతున్నారు.

వెండి తెర తళుకులు లేక..గొడౌన్లుగా థియేటర్లు

వెండి తెర మూగబోయింది. థియేటర్​లలో బొమ్మ పడి 105 రోజులు దాటేసింది. ఈ ఏడాది మార్చి 24వ తేదీన మొదలైన లాక్​డౌన్​తో మూతపడిన సినిమా థియేటర్లు నేటికీ తెరుచుకోలేదు. అభిమాన హీరోల చిత్రాల విడుదల వేళ.. పెళ్లి వేడుకలా కళకళలాడే థియేటర్లు.. నేడు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన అన్​లాక్​ 2.0 మినహాయింపుల్లో థియేటర్లకు స్థానం దక్కలేదు. మూడు నెలలుగా థియేటర్లు మూతపడిన కారణంగా.. యాజమానులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ప్రత్యామ్నాయంగా..

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల్లో.. కేంద్రపాలిత ప్రాంతం యానాంతో కలిపి.. 12 థియేటర్లు ఉన్నాయి. ఉపాధి లేక వీటిల్లో 8 థియేటర్లను గొడౌన్లు, సమావేశ మందిరం, కల్యాణ మండపాలుగా మారుస్తున్నారు. భవిష్యత్తులో సినిమాలు ప్రదర్శించినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీట్ల సంఖ్య కుదింపు.. ఇతర సౌకర్యాల కల్పనకు ఖర్చు పెరిగిపోతుందన్న కారణంతో.. యాజమానులు ఈ మార్గం ఎంచుకుంటున్నారు. థియేటర్లకు గతంలో మాదిరి ప్రేక్షకులు రారని, అయినా నిర్వహణ ఖర్చులు తప్పవని యాజమానులు అంటున్నారు. అందుచేతనే థియేటర్లను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్టంలో చురుకుగా రుతుపవనాలు... పలు జిల్లాల్లో వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.