వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటంలో తప్ప రైతులను ఆదుకోవడంలో విఫలమైందని తెదేపా విమర్శించింది. వైఎస్ పేరు చెప్పి రైతులకు ముఖ్యమంత్రి జగన్ తానేదో చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప విమర్శించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని... సాగునీరు అందక, విత్తనాలు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోనే రబీ ధాన్యం బకాయిలు రూ.400 కోట్లు ఉన్నాయని, సాగుదారులకు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని చినరాజప్ప అన్నారు. రైతు బకాయిలు చెల్లించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గదిలో ఇల్లాలు.. పక్కగదిలో ప్రియురాలు; హనీమూన్ కు తీసుకెళ్లిన ఘరానామొగుడు