ETV Bharat / state

మిఠాయి బొకేలతో అభినందనలు తెలుపుకుందామా..! - మండపేటలో చాక్లెట్​ బొకేలు తయారీ

వివాహ శుభకార్యాలైనా.. అభినందన కార్యక్రమాలైనా... ఏవైనా కానీ పూల బొకేలతో శుభాకాంక్షలు చెబుతుంటారు. కానీ అవన్నీ సాయంత్రానికి వృథాగా పోవాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విజయలక్ష్మి వినూత్నంగా ఆలోచించి మిఠాయి బొకేలు తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మరి ఆ బొకేల సంగతేంటో మనమూ తెలుసుకుందామా..!

chocolate Bouquet prepared by vijayalakshmi in mandapeta at east godavari
ఈ బొకేలు తినేయొచ్చు..!
author img

By

Published : Feb 10, 2020, 1:55 PM IST

ఈ బొకేలు తినేయొచ్చు..!

తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన విజయలక్ష్మి భర్తతో కలిసి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వృద్ధులకు దుస్తులు, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసేవారు. కొన్ని అభినందన కార్యక్రమాల్లో పూల మాలలు, బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు. అవన్నీ వృథాగా పోతున్నాయని గుర్తించిన ఆమె.. వీటికి బదులుగా వినూత్నంగా చాక్లెట్ బొకేలకు శ్రీకారం చుట్టారు.

డ్రైప్రూట్స్​, చాక్లెట్​తో బొకేల తయారీ

విజయలక్ష్మి తీపి బొకేల తయారీలో మరింత సృజనాత్మకత జోడించి చిరుధాన్యాలు, బాదం, పిస్తా, జీడిపప్పులతో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. తన అభిరుచికి మరిన్ని మెరుగులు దిద్దేందుకు... యూట్యూబ్ ఛానెల్‌ను ఎంచుకున్నారు. కొన్నిసార్లు ఒకే రోజు 150 ఆర్డర్లు కూడా వచ్చేవి. ఆర్డర్లు ఎక్కువ కావటంతో కొంతమంది మహిళలకు ఉపాధి సైతం కల్పిస్తున్నారు. తనకు వచ్చిన ఆదాయంతోనే సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలనుకుంటున్నారు విజయలక్ష్మి.

ఇదీ చదవండి:

'దేన్నైనా పుట్టించే శక్తి ఆ ఇద్దరిదే.. వారి కోసమే నా యాత్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.