రాష్ట్రంలో కోవిడ్ కేసులకు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని... తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. వైకాపా నేతల నిర్లక్ష్యం, అహంకార వైఖరి కారణంగానే రాష్ట్రంలో కేసుల సంఖ్య 1400 దాటిందని మండిపడ్డారు. వైరస్ కేసులను తక్కువగా చూపిస్తే ప్రజలకు ద్రోహం చేసినట్లే అవుతుందని అన్నారు. సహాయక చర్యలకు తగినన్ని నిధులు ఖర్చు చేయడానికి వైకాపా ప్రభుత్వం సంకోచిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అత్యాశ కారణంగానే కరోనా వైరస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యాపించిందని చినరాజప్ప అన్నారు.
ఇదీ చదవండి