దళిత ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ మృతిపై న్యాయవిచారణకు డిమాండ్ చేశారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. అలాంటి కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధమైన చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను అక్రమంగా గృహనిర్భంధం చేయడాన్ని ఆయన ఖండించారు. చనిపోయిన ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించడానికి తెదేపా నేతలు వెళుత్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని నిలదీశారు.
మృతుడి సెల్ ఫోన్ మాయం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఫోన్ కాల్ లిస్ట్ ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. మద్యం బ్రాండ్లపై, ధరలపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నందుకు దళిత యువకుణ్ని హత మార్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుని కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: చిత్తూరులో తెదేపా నేతల గృహనిర్భందం