ETV Bharat / state

నాటు సారా స్థావరాలపై పోలీసు దాడులు.. - తూర్పుగోదావరి జిల్లాలో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం ధరలు.. రోజువారి కూలి పనులపై ఆధారపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటులో లేకపోవడంతో.. వారంతా నాటుసారా వైపు వెళుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది మధ్యవర్తులు తయారీదారులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో.. నాటు సారా తయారీకి ఉపయోగించే రసాయనాలు, బెల్లం, తయారీకి సిద్ధంగా ఉంచిన మొలాసిస్​ను గుర్తించిన అబ్కారీ శాఖ అధికారులు, పోలీసులు.. వాటిని ధ్వంసం చేశారు. సారా తయారీకి గోదావరి నది పాయల మధ్య ఉండే లంక భూములు.. మడ అడవులను ప్రధాన స్థావరాలుగా వినియోగించుకుంటున్నారు.

cheap liquor damaged by police at east godavari and kurnool
నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
author img

By

Published : Oct 29, 2021, 10:00 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో నాటుస్థారా స్థావరాలపై అబ్కారీ అధికారులు దాడి చేశారు. సారా తయారు చేసే మొలాసిస్​ను గుర్తించి ధ్వంసం చేశారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాలకు చెందిన మత్స్యకార గ్రామాల్లోని కొందరు.. నాటు సారా తయారీని ఓ వృత్తిగా చేసుకున్నారు. ఇతర జిల్లాలకు చెందిన దళారులు వీరికి కావలసిన ఆర్థిక సహాయం అందిస్తుండటంతో.. వీరి వ్యాపారం ఏళ్లతరబడి కొనసాగుతోంది. స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులంతా కలిసి దాడిచేసినా తయారీ దారులను పూర్తిస్థాయిలో పట్టుకోలేకపోతున్నారు.

ఇటీవల జిల్లాలో మద్యం, గంజాయి, గట్కా.. ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న వారిని, వాహనాలను అధికారులు పట్టుకున్నారు కానీ.. నాటుసారా తయారీదారులు మాత్రం వీరికి చిక్కటం లేదు. ఇటీవల నాటు సారా తయారీకి ఉపయోగించే రసాయనాలు, బెల్లం, తయారీకి సిద్ధంగా ఉంచిన మొలాసిస్​ను గుర్తించిన అబ్కారీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు.

కర్నూలు జిల్లాలో నాటుసారా ధ్వంసం..
కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు.. వివిధ చోట్లలో పట్టుబడిన నాటుసారాను ట్రాక్టర్, బొలెరో వాహనంతో ధ్వంసం చేయించారు. డోన్ సబ్ డివిజన్ పరిధిలోని 13 పోలీస్ స్టేషన్లలోనే 250 నాటుసారా కేసులు నమోదయ్యాయి. 2000 లీటర్ల సారాను, టెట్రా ప్యాకెట్లను ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి:

Naidupeta Municipality: 'టీ, బిస్కెట్లు తినేందుకే.. సమావేశాలకు వస్తున్నట్టుంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.