ETV Bharat / state

రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం అనుమతి - కేంద్ర ఔషధ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ

BULK DRUG PARK IN AP: రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తూర్పు గోదావరి జిల్లా కేపీపురంలో పార్కు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియచేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ అందిన వారం రోజుల్లోగా అంగీకారాన్ని తెలియచేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది.

BULK PARK DRUG IN AP
BULK PARK DRUG IN AP
author img

By

Published : Aug 30, 2022, 8:37 PM IST

Bulk Drug Park: రాష్ట్రానికి బల్క్ ​డ్రగ్ పార్కును కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా కేపీపురం వద్ద ఈ పార్కును నిర్మించడానికి అనుమతి ఇస్తున్నట్టు సీఎస్ సమీర్ శర్మకు కేంద్ర ఔషధ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ ఎన్​.యువరాజ్ లేఖ రాశారు. లేఖ అందిన వారం రోజుల్లోగా ప్రాజెక్టు ఏర్పాటు కోసం అంగీకారాన్ని తెలియచేయాల్సిందిగా కేంద్రం పేర్కొంది. అలాగే 90 రోజుల్లోగా ప్రాజెక్టు డీపీఆర్​ను కూడా సమర్పించాల్సిందిగా సూచించింది.

కేంద్రం సూచించిన మార్గరద్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను అందించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొంది. మరోవైపు బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటులో భాగంగా కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్​గా 1000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్కుల కోసం 13 రాష్ట్రాలు పోటీ పడితే అందులో 3 రాష్ట్రాలు మాత్రమే దక్కించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్కు కోసం పోటీ పడ్డాయి.

రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం 2020 ఆగస్టులోనే రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కేపీపురంలో 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.