తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో... శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం దృశ్యాలు... సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వివాహం అనంతరం కుటుంబ సభ్యులందరూ...ఇళ్లకు వెళ్లేందుకు వాహనం ఎక్కారు. పెళ్లి మండపం దగ్గర ఉన్న కానుకలు, ఇతర సంచులు వ్యానులో సర్దే క్రమంలో వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. బండిలో ఉన్న ముగ్గురు కిందకు దూకగా...మిగిలిన వారు మరణించారు.
ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రవాణా శాఖ అధికారులు తేల్చారు. ప్రయాణికులు వాహనం ఎక్కిన తర్వాత న్యూట్రల్ పెట్టి హ్యాండ్ బ్రేక్ వెయ్యక పోవడమే కారణమని నిర్ధారించారు. 15 అడుగుల పై నుంచి మెట్ల మీదుగా కిందకు బోల్తా కొట్టిన ఘటనలో 7 చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరుడి పెద్ద సోదరి ఈ తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో మరణించిన వారి సంఖ్య 8 కి చేరింది. ఈ ఘటనతో కళ్యాణ వెంకటేశ్వరుడి కొండపైకి వాహనాలను నిషేధించారు. ఇవాళ ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండీ...పెళ్లి వేడుకకు హాజరై.. పరలోకానికి చేరి..