కాపు రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వెలంపేట జాతీయ రహదారిపై 2016 జనవరి 31న జరిగిన అల్లర్లకు సంబంధించి మరో 17 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీనిపై ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం జీవో నంబరు 717తో ఉత్తర్వులిచ్చారు.
అప్పట్లో కాపు రిజర్వేషన్ల సాధనకు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన సభకు పెద్దసంఖ్యలో కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సభ తర్వాత ప్రాంగణం నుంచి ఒక్కసారిగా వేల మంది రోడ్డు, రైలుమార్గం వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటికే విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న రత్నాచల్ సూపర్‌ఫాస్ట్ రైలు దహనమైంది. తుని రూరల్, పట్టణ పోలీస్‌స్టేషన్లపైనా దాడులు జరిగాయి. ఈ ఘటనలకు సంబంధించి మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 18న 51 కేసులు ఎత్తివేయగా.. తాజాగా మరో 17 ఉపసంహించుకుంది.
ఇదీ చదవండి: మ్యాట్రిమోనీలో ధనవంతులకు వలవేసి.. మూడు పెళ్లిళ్లు