ETV Bharat / state

కాల్వలోకి కారు.. ముగ్గురి గల్లంతు

car-accident
car-accident
author img

By

Published : Mar 12, 2021, 7:06 AM IST

Updated : Mar 13, 2021, 2:57 AM IST

07:04 March 12

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొలాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాల్వలో రెండు మృతదేహాల్ని గుర్తించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన ముందిటి సురేష్‌ వర్మ(36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు(46), ఇందుకూరి వెంకటసత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతిరాజు, మున్నింటి సీతారామరాజు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. మహా శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడలో బంధువులు ఉండటంతో శివరాత్రి వేడుకలకు గురువారం వచ్చారు. వీరంతా ఈ తెల్లవారుజామున తిరిగి కారులో వెళ్తుండగా...లొల్లాకుల మలుపు వద్దకు వచ్చేసరికి మంచు కారణంగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వీరిలో వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడగా.. మిగిలిన ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. సురేష్‌ వర్మ, శ్రీనివాస్‌రాజుల మృతదేహాలు లభ్యం కాగా, వెంకటసత్యనారాయణరాజు కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్న సీఎం జగన్‌

Last Updated : Mar 13, 2021, 2:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.