తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా... ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా అస్సాంకు చెందిన కూలీలు.
ప్రయాణికులంతా కేరళలో పనికి వెళ్తుండగా మార్గం మధ్యలో జొన్నాడ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బస్సు రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. చెట్టు లేకపోతే పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లి పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సులో చిన్నారులు, మహిళలు, పురుషులు కలిపి సుమారు 50మంది దాకా ఉన్నారు. తృటిలో ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి..10 మందికి గాయాలు