ETV Bharat / state

Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: టీడీపీ శ్రేణులపై పోలీసు నిర్బంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 2:43 PM IST

Updated : Oct 18, 2023, 3:58 PM IST

Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: టీడీపీ నేతలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లోకేశ్​ రాజమహేద్రవరం చేరుకోని టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహనిర్భంధం చేశారు.

bhuvaneshwari_on_police
bhuvaneshwari_on_police

Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడా ఉండదని విమర్శించారు. ఇదేమి చట్టం, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి తనను ఎంతో బాధించిందని మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో.. ఈ ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత హక్కులు, సంప్రదాయాలను... రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నట్లు తెలిపారు.

Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: టీటీపీ శ్రేణులపై పోలీసు నిర్బంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి

Lokesh Questioned DIG Ravi Kiran on CBN Health జైళ్లశాఖ డీఐజీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన లోకేశ్.. ప్రభుత్వ వైద్యుల నివేదికను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న!

Lokesh Reached Rajamahendravaram TDP Camp Office: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దిల్లీ నుంచి విజయవాడ చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం రాజమహేంద్రవరంలోని టీడీపీ క్యాంప్ కార్యాలయానికి లోకేశ్ వచ్చారు. అందుబాటులో ఉన్న నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. చంద్రబాబుకి జైలులో లీగల్ ములాఖత్​లలో కోత పెట్టడంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి లోకేశ్ చంద్రబాబుని కలవనున్నారు. క్యాంప్ కార్యాలయానికి టీడీపీ నాయకులు వస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో (skill development case) దాఖలు క్వాష్ పిటిషన్​ను సుప్రీంకోర్టు రిజర్వ్ చేయటంతో రాజమండ్రి బస కేంద్రం వద్ద లోకేశ్ నేతలతో సమీక్షించనున్నారు.

Nara Lokesh about CID Investigation: అవే ప్రశ్నలు.. తిప్పి తిప్పి మళ్లీ అడిగారు: లోకేశ్

Former Minister Devineni Uma Under House Arrest: విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహానిర్భంధం చేశారు. గొల్లపూడిలోని ఉమా ఇంటిని ఉదయం 8 గంటలకే చుట్టుముట్టిన పోలీసులు ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వానికి భయమెందుకని ఉమా నిలదీశారు. దసరా శరన్నవరాత్రులు జరుగుతుంటే, భక్తులు రాకుండా ఆంక్షలు పెట్టారని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం... ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర గారి పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో… pic.twitter.com/syGf26aUtm

— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CBN Family Emotional After Seeing Chandrababu చంద్రబాబును చూసి భావోద్వేగానికి లోనైన భువనేశ్వరి, లోకేశ్..

10 లక్షల మంది భక్తులు వచ్చే విజయవాడ మహానగరంలో 144సెక్షన్ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మూర్ఖ ముఖ్యమంత్రి చేసే తెలివి తక్కువ పనులకు భక్తులు బలికావాలా అని నిలదీశారు. పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని వారికి ధైర్యం చెప్పి సమస్యలను అధికారులకు నివేదించేందుకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎలాంటి నిరసనలు చేపట్టకుండా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడా ఉండదని విమర్శించారు. ఇదేమి చట్టం, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి తనను ఎంతో బాధించిందని మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో.. ఈ ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత హక్కులు, సంప్రదాయాలను... రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నట్లు తెలిపారు.

Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: టీటీపీ శ్రేణులపై పోలీసు నిర్బంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి

Lokesh Questioned DIG Ravi Kiran on CBN Health జైళ్లశాఖ డీఐజీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన లోకేశ్.. ప్రభుత్వ వైద్యుల నివేదికను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న!

Lokesh Reached Rajamahendravaram TDP Camp Office: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దిల్లీ నుంచి విజయవాడ చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం రాజమహేంద్రవరంలోని టీడీపీ క్యాంప్ కార్యాలయానికి లోకేశ్ వచ్చారు. అందుబాటులో ఉన్న నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. చంద్రబాబుకి జైలులో లీగల్ ములాఖత్​లలో కోత పెట్టడంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి లోకేశ్ చంద్రబాబుని కలవనున్నారు. క్యాంప్ కార్యాలయానికి టీడీపీ నాయకులు వస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో (skill development case) దాఖలు క్వాష్ పిటిషన్​ను సుప్రీంకోర్టు రిజర్వ్ చేయటంతో రాజమండ్రి బస కేంద్రం వద్ద లోకేశ్ నేతలతో సమీక్షించనున్నారు.

Nara Lokesh about CID Investigation: అవే ప్రశ్నలు.. తిప్పి తిప్పి మళ్లీ అడిగారు: లోకేశ్

Former Minister Devineni Uma Under House Arrest: విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహానిర్భంధం చేశారు. గొల్లపూడిలోని ఉమా ఇంటిని ఉదయం 8 గంటలకే చుట్టుముట్టిన పోలీసులు ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వానికి భయమెందుకని ఉమా నిలదీశారు. దసరా శరన్నవరాత్రులు జరుగుతుంటే, భక్తులు రాకుండా ఆంక్షలు పెట్టారని ధ్వజమెత్తారు.

  • తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం... ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర గారి పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో… pic.twitter.com/syGf26aUtm

    — Nara Bhuvaneswari (@ManagingTrustee) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CBN Family Emotional After Seeing Chandrababu చంద్రబాబును చూసి భావోద్వేగానికి లోనైన భువనేశ్వరి, లోకేశ్..

10 లక్షల మంది భక్తులు వచ్చే విజయవాడ మహానగరంలో 144సెక్షన్ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మూర్ఖ ముఖ్యమంత్రి చేసే తెలివి తక్కువ పనులకు భక్తులు బలికావాలా అని నిలదీశారు. పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని వారికి ధైర్యం చెప్పి సమస్యలను అధికారులకు నివేదించేందుకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎలాంటి నిరసనలు చేపట్టకుండా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Last Updated : Oct 18, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.