ETV Bharat / state

రాపాకకు ప్రవేశం లేదంటూ బ్యానర్.. జనసైనికుల వినూత్న నిరసన - rapaka latest news

రాజోలులో జనసేన తరఫున ఎన్నికల్లో గెలుపొంది... వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాపాక వరప్రసాద్​కు జనసైనికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జనసేన రాజోలు నియోజక వర్గ కార్యకర్తలు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు రాపాకకు ప్రవేశం లేదంటూ బ్యానర్​ను ఏర్పాటు చేశారు.

no permission rapaaka
రాపాకకు ప్రవేశం లేదంటూ బ్యానర్.. జనసైనికుల వినూత్న నిరసన
author img

By

Published : Mar 23, 2021, 6:47 AM IST

తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో రాజోలు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు స్థానిక జీఎంఆర్ గ్రౌండ్స్​లో బహిరంగసభను ఏర్పాటు చేశారు . దీనికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసైనికులు సభా ప్రాంగణం ఎదుట రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​కు వినూత్న రీతితో నిరసన తెలిపారు. రాపాకకు సభా ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత జనసేన పార్టీ సీనియర్ నాయకులు సదరు బ్యానర్​ను తొలగించారు. గత కొంత కాలంగా జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీకి దూరంగా ఉంటూ వైకాపాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంపై జనసైనికులు ఆయనపై గుర్రుగా ఉన్నారు.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో సెల్ టవర్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.