ETV Bharat / state

ఆ విషయం మాట్లాడటానికే ఇక్కడకు వచ్చా: నాగార్జున

Bangarraju movie Blockbuster Meet : ‘బంగార్రాజు’ చిత్ర బృందం రాజమహేంద్రవరంలో ‘బ్లాక్‌ బస్టర్‌ మీట్‌’ వేడుకను నిర్వహించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి అని మీరంతా మరోసారి నిరూపించారని నాగార్జున తెలిపారు. సీఎం జగన్​తో ఇటీవల జరిగిన భేటీ గురించి మిత్రుడు చిరంజీవిని అడిగా.. ‘సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు’ అని చిరంజీవి తెలిపారని నాగార్జున వెల్లడించారు.

nagarjuna
nagarjuna
author img

By

Published : Jan 19, 2022, 8:43 AM IST

Bangarraju movie Blockbuster Meet : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం రాజమహేంద్రవరంలో ‘బ్లాక్‌ బస్టర్‌ మీట్‌’ వేడుకను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

బంగార్రాజు ‘బ్లాక్‌ బస్టర్‌ మీట్‌’

‘‘కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా సంక్రాంతి వేడుకలు సాదాసీదాగా సాగాయి. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో కళను తీసుకొచ్చిన నాగార్జున గారికి థాంక్స్‌. ఈ వేడుకను రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా సంతోషం. చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ‘‘ఈ వేడుకను ఇక్కడ నిర్వహించినందుకు బంగార్రాజు చిత్ర బృందానికి ధన్యవాదాలు. నేనూ మా అన్నయ్య నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన స్టైల్‌ అనుసరించేవాళ్లం. తొలిసారి ఆయన్ను ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం చూసి ఎలా ఉందో ట్వీట్‌ చేస్తా’’ అని ఎంపీ భరత్‌రామ్‌ అన్నారు.

నాగార్జున

నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ప్రపంచమంతా భయపడుతున్నా.. ఉత్తరాదిలో చిత్రాల విడుదల ఆపేసినా.. సంక్రాంతికి సినిమా రిలీజ్‌ చేయండి చూస్తాం.. మీకు బ్లాక్‌ బస్టర్‌ హిట్ ఇస్తాం అని చెప్పిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి అని మీరంతా మరోసారి నిరూపించారు. నేను వసూళ్ల గురించి మాట్లాడేందుకు రాలేదు. మీ గురించి మాట్లాడటానికే ఇక్కడికి వచ్చా. మీ ఆదరాభిమానాలు చూసినప్పుడల్లా మా నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు)కి థాంక్స్‌ చెప్పాలనిపిస్తుంటుంది. ఏపీ సీఎంతో ఇటీవల జరిగిన భేటీ గురించి మిత్రుడు చిరంజీవిని అడిగా. ‘సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారని అందరూ అంటుంటారు. ఈరోజు ఎన్టీఆర్‌ వర్థంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఆయన్ను మనం గుర్తుచేసుకోవాలి. చేసుకుంటాం’’ అని అన్నారు.

నాగ చైతన్య

‘‘రాజమహేంద్రవరంతో నాకో సెంటిమెంట్‌ ఏర్పడింది. ఇక్కడికి సినిమా షూటింగ్‌కి వచ్చినా, ఏదైనా వేడుకకు వచ్చినా అది సూపర్‌ హిట్టే. కొవిడ్‌ పరిస్థితుల్లో.. ఈ సినిమాను చూస్తారా? లేదా అనే సందేహంతోనే విడుదల చేశాం. మిమ్మల్ని (ప్రేక్షకులు), కథని నమ్మి ముందడుగేశాం. ఇంతటి ఆదరణ చూపిస్తారని నేను ఊహించలేదు. మీరు.. మా కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్‌ చూపించారు, బెస్ట్‌ కలెక్షన్లను చూపించబోతున్నారు. ఇందుకు జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటా. మంచి టీమ్‌ వల్లే అతి తక్కువ సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. పండగకు సినిమా హిట్‌ అందుకుంటే ఎలా ఉంటుందో నాన్న నాకు చూపించారు’’ . -నాగ చైతన్య

ఆర్‌. నారాయణమూర్తి

‘‘నేను అక్కినేని నాగేశ్వరరావుగారి అభిమానిని. ఆ మహానటుడి ఆశీస్సులు ‘బంగార్రాజు’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవటానికి కారణమయ్యాయి. ఈ విజయం ప్రేక్షకులది. ఈ సినిమాలో నాగ చైతన్య నటన చూసి ఆశ్చర్యపోయా. ఆయన అలా నటిస్తారని నేను అనుకోలేదు. ‘మా నాగ చైతన్యగారికి ఎప్పుడు బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ వస్తుందా’ అని ఎదురుచూసిన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. దర్శకుడు కల్యాణ్‌కృష్ణలో రాఘవేంద్రరావు కనిపించాడు. కుటుంబ విలువల గురించి ఆయన బాగా చెప్పాడు. ఈ సినిమాలో నాగార్జున గారు చెప్పిన ఓ డైలాగ్‌ విని ఏడ్చేశా. పండగను దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని వాయిదా వేయటం వల్ల ఎక్కువ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారికి కృతజ్ఞతలు’’ . -ఆర్‌.నారాయణమూర్తి

ఇదీ చదవండి : Chiranjeevi meets CM YS Jagan: సినిమా టికెట్ల ధరలు పెంచాలని సీఎంను కోరా: మెగాస్టార్​ చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.