తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో అత్యధికంగా రైతులు అరటి పంట సాగు చేస్తుంటారు. కర్పూర, చక్కెరకేళి, ఎరుపు అరటి, భూషావలి, అమృతపాణి ఈ పంటలన్నీ గోదావరికి వరద రావటంతో పూర్తిగా మునిగిపోయాయి. రోజుల తరబడి నీటిలో నాని ఉండడంతో అరటి చెట్లు కింద భాగం కుళ్లిపోయి చెట్లు చనిపోతున్నాయి. చెట్ల ఆకులు పసుపు రంగులో మారి ఎండిపోవటంతో చేతికొచ్చిన పంట నాశనం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి