తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆరోగ్య, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వినూత్న ప్రచారంతో ఎయిడ్స్‌ని పూర్తిగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ తెలిపారు. ప్రాణంతకర వ్యాధి బారిన పడకుండా యుక్త వయసు వారంతా సురక్షితమైన విధానాలు పాటించాలని సూచించారు. ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సుఖ వ్యాధులు.. రక్తదానం.. అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామని అయన వివరించారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో హెచ్ఐవీ రోగులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఉచితంగా దుప్పట్లు, ఇతర వస్తు సామగ్రిని పంపిణీ చేశారు. రోగులు మనో ధైర్యాన్ని కోల్పోకూడదని వైద్యులు సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం సకాలంలో తీసుకోవడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలిపారు.
ఇదీ చదవండి: