అనంతపురం జిల్లాలో..
కదిరిలో అధికారులు, సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ సాగింది. 'మాస్కులు ధరిద్ధాం మహమ్మారిని తరిమేద్దాం' అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో..
కరోనా వైరస్ను అరికట్టేందుకు చేపట్టిన నివారణ చర్యల్లో 'మాస్కే కవచం కార్యక్రమం' కర్నూలు జిల్లాలో ముగిసింది. డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం 50 రోజులపాటు కొనసాగింది. చివరి రోజు కలెక్టర్ వీర పాండియన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో..
నరసన్నపేటలో గత 50 రోజులుగా జరుగుతున్న కరోనా నివారణ అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. ఎంపీడీఓ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లాలో.. కోవిడ్-19 నివారణపై ప్రజలను జాగృతం చేసేందుకు 58 రోజులు పాటు అవగాహన కార్యక్రమాలు ముగియటంతో కొవ్వొత్తులతో ర్యాలీ ప్రదర్శన చేశారు. కరోనా వ్యాక్సిన్ జిల్లాలో ఇప్పటి వరకు 8వేల మందికి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: