తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో దిశ యాప్‌పై సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు దిశ యాప్‌పై అవగాహన కల్పించారు. స్థానిక గ్రాండ్ పార్కు కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ పాల్గొన్నారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, వాటిపై అవగాహన ఏర్పరుచుకోవాలని స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ తెలిపారు. దిశ చట్టం మహిళలకు రక్షణగా ఉంటుందని, మరింత బలం చేకూర్చేందుకు యువత, మహిళలు దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ సూచించారు.
ఇదీ చదవండి: