కార్డు మార్చి... రూ.38 వేలు చోరీ
ఇద్దరి నుంచి ఏటీఎం కార్డులు తీసుకున్న అపరిచిత వ్యక్తి ఏటీఎంలో వాటిని పెట్టి నగదు లేదని తిరిగి వారికి కార్డులు ఇచ్చేశాడు. ఇక్కడే వారిని ఆ వ్యక్తి బురిడీ కొట్టించాడు. వీరి కార్డులను రెప్పపాటు కాలంలో మాయం చేసి వేరే కార్డులు ఇచ్చాడు. నాగలక్ష్మికి ఎస్‌బీఐ, వెంకటేశ్వరరావుకు ఆంధ్రాబ్యాంకు ఏటీఎం కార్డులు ఇవ్వటంతో అవే వారి కార్డులని వారు నమ్మారు. ఏటీఎంలో డబ్బులు లేకపోవటంతో నాగలక్ష్మి అక్కడే ఉన్న ఎస్‌బీఐ బ్రాంచి లోపలకు వెళ్లి ఆ కార్డును ఇచ్చింది. ఈ కార్డు ఆమెది కాదని, పనిచేయటంలేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అదే విధంగా వెంకటేశ్వరరావు ఆంధ్రాబ్యాంకుకు వచ్చి పాసు పుస్తకం ద్వారా రూ.10 వేలు డ్రా చేసుకున్నాడు. ఇంకా అతని ఖాతాలో రూ.18 వేలు ఉండాలి. మిగిలిన నగదు లేదు. బాధితులు సంబంధిత బ్యాంకులకు ఆరా తీయగా అపరిచిత వ్యక్తి వీరి నుంచి కాజేసిన ఏటీఎం కార్డులను ఉపయోగించి.. జి.పెదపూడి ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు తేలింది. నాగలక్ష్మి ఖాతా నుంచి రూ.20 వేలు, వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ.18వేలు కలిపి మొత్తం రూ.38 వేలు కాజేశాడు. తాము మోసపోయామన్న విషయం తెలుసుకుని బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరి ఏటీఎం కార్డులను బ్యాంకు అధికారులు బ్లాక్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీలను సేకరించి నిందితుణ్ని పట్టుకుంటామని ఎస్సై జి.హరీష్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: