ETV Bharat / state

బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు - తూర్పుగోదావరి జిల్లాకు అరకొరగా కేటాయింపులు

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాలో సాగునీరు, ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉండడం కొంత నిరుత్సాహ పరిచింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండోసారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ - 2020-21లో జిల్లాకు కొన్ని కేటాయింపులు దక్కాయి. జిల్లాలో కొన్ని ప్రాజెక్టులు, సంస్థల అభివృద్ధికి కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు.

ap budget f
ap budget f
author img

By

Published : Jun 17, 2020, 6:47 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంలో ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు రంపచోడవరం, చింతూరులలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రతిపాదించినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. మన్యంలో రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్ల పరిధిలో 11 మండలాలు ఉండగా ప్రస్తుతం చింతూరు, రంపచోడవరంలలో ప్రాంతీయ ఆసుపత్రులున్నాయి. నిపుణుల కొరత వేధిస్తుండటంతో అత్యవసర సేవలకు సుదీర్ఘంగా ప్రయాణించి కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చింతూరులో ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చనున్నారు. రంపచోడవరంలో ప్రస్తుతం 50 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. తాజా బడ్జెట్‌ ప్రకటనతో ఈ వైద్యశాల స్థాయి పెరగనుంది.

జిల్లాలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరంలో చేపల రేవు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ఉప్పాడలో రూ.350 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో ఎంత కేటాయించారో తెలియాల్సి ఉంది. మత్స్యకార మౌలిక వసతుల అభివృద్ధి నిధులు (ఎఫ్‌ఐడీఎఫ్‌) రూ.150 కోట్లు, నాబార్డు నిధులు రూ.180 కోట్లు..మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు..అంతర్వేది పల్లిపాలెంలో మైనర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ అందుబాటులో ఉన్నాయి. ఉప్పాడలో ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే 2,500 బోట్లకు వసతులు అందుబాటులోకి రావడంతో పాటు 1.10 లక్షల టన్నుల మత్స్య సంపద వెలికితీతకు అవకాశాలు మెరుగుపడతాయి.

మహిళలకు ఉపాధితో పాటు రాయితీలు, ఐస్‌ ప్లాంట్లు సమకూరే వీలుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దక్కుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.ఉన్నత విద్యకు ఊతంలో భాగంగా కాకినాడలోని జేఎన్‌టీయూ అభివృద్ధికి రూ.41.95 కోట్లు కేటాయించారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, పెన్షనర్ల జీతభత్యాలతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులు ఇవ్వనున్నారు. రాజానగరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి రూ.11.98 కోట్లు కేటాయించారు. విద్యార్థుల వసతి గృహ భవనాలతో పాటు సైన్స్‌ కళాశాల భవనం, సివిల్‌- మెకానికల్‌ ఇంజినీరింగ్‌ భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

సాగునీటి ప్రాజెక్టులకు ఊతమేదీ..?

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించినా నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉండడం నిరుత్సాహ పరిచింది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఏలేరు ప్రాజెక్టు కింద 500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నారు.కెనాల్‌, డిస్ట్రిబ్యూషన్‌ అభివృద్ధికి కేటాయించిన రూ.11.11 కోట్లలో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు. గోదావరి రివర్‌ ఫ్లడ్‌ బ్యాంకు 103 కిలోమీటర్లు, గోదావరి డెల్టా ఏరియా 4.09 లక్షల ఎకరాల స్థిరీకరణకు రూ.15.19 కోట్లు కేటాయించారు. గోదావరి డెల్టా సిస్టంలో 10.13 లక్షల ఎకరాల స్థిరీకరణకు నిధులు కేటాయించనున్నారు.

కీలక ప్రాజెక్టులకూ అంతే

సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లాలో పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాకినాడ పోర్టుకు రూ.500.87 లక్షలు, సాగరమాల ప్రాజెక్టుకు రూ.10 కోట్లు కేటాయించారు. పర్యాటకంలో భాగంగా కాకినాడలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఐహెచ్‌ఎం) భవన నిర్మాణానికి రూ.90 లక్షలు కేటాయించారు. ఆయుష్‌ పథకం కింద ఔషద మొక్కల పెంపకానికి కాకినాడలోనూ చర్యలు చేపట్టనున్నారు. కాకినాడలో 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదించారు.

చదువుకు ప్రోత్సాహం

ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి మూడు జతల యూనిఫాం, రాత, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, స్కూలు బ్యాగు మొత్తం ఒక కిట్‌గా అందిస్తామని ప్రకటించారు. జిల్లాలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు 370, ప్రాథమిక పాఠశాలలు 2,424.. ప్రాథమికోన్నత పాఠశాలలు 295, ఉన్నత పాఠశాలలు 551 ఉన్నాయి. నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం దక్కనుంది. మధ్యాహ్న భోజనం మెనూలో బెల్లం చిక్కి, పులిహోర, పొంగలి, వెజ్‌ పలావ్‌ అందిస్తున్నామని ప్రకటించారు. జిల్లాలో 2,75,560 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు.

రైతుకు దన్ను

రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.11,891 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకు రూ.3,615 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.మూడు వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న జిల్లాలో తాజా కేటాయింపులతో అన్నదాతలకు భరోసా దక్కుతుందని భావిస్తున్నారు. జిల్లాలో 2.28 లక్షల హెక్టార్లు సాగవుతోంది. రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్‌ పథకాలకు జిల్లాలో 4.71 లక్షల మంది అర్హులున్నారు. రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

ఉపాధికి ఊతం

ఆంధ్రప్రదేశ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ కాండిడేట్స్‌ ఇన్‌ ద ఇండస్డ్రీస్‌/ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌- 2019 ద్వారా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఈ ఏడాది రూ.19.93 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. ఇందులో రూ.7.58 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందజేశారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు చేపడతామని ప్రకటించడంతో జిల్లాలో వసతుల లేమిని అధిగమించే అవకాశముంది.

ఇదీ చదవండి: భారత్​, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.