ETV Bharat / state

ఆన్‌లైన్‌లో అన్నవరం సత్యదేవుని ఆర్జిత సేవలు

author img

By

Published : Jun 7, 2021, 7:49 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు, పూజలను భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించే నూతన విధానాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం ఈవో త్రినాథరావు స్విచ్ ఆన్ చేశారు. కరోనా కారణంగా భక్తులు అన్నవరంలో  ప్రత్యక్షంగా పూజల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఈ విధానాని తీసుకొచ్చారు.

annavaram satyanrayan swamy arjitha seva in online
ఆన్‌లైన్‌లో అన్నవరం సత్యదేవుని ఆర్జిత సేవలు

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారికి జరిగే ఆర్జిత సేవలు, పూజలను భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించే అవకాశం ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. పూజలను చిత్రీకరించి యూట్యూబ్‌కు అనుసంధానం చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించే భక్తులకు లింక్‌ పంపిస్తారు.

ప్రసాదం, పసుపు, కుంకుమ, రవిక, కండువ, అక్షింతలు పోస్టల్‌ ద్వారా పంపిస్తారు. భక్తులు tms.ap.gov.in లేదా www.annavaramdevasthanam.nic.in ద్వారా సేవలు పొందవచ్చని ఈవో త్రినాథరావు తెలిపారు.

ఇదీ చదవండి:

తొలుత సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.