మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లను తూర్పుగోదావరి జగ్గంపేటలోని ఓ ఇంట్లో పోలీసులు, సీడీపీవో అధికారులు పట్టుకున్నారు. స్థానిక గోకవరం రోడ్డులోని ఓ ఇంట్లో అంగన్వాడీ గుడ్లు ఉన్నాయని గుర్తించిన స్థానికులు.. వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జగ్గంపేట సీఐ సురేశ్ బాబు అక్కడకి వచ్చి గుడ్లను పరిశీలించారు. 11 వేల గుడ్లపై మధ్యాహ్న భోజన అంగన్వాడీ స్టాంపు ఉన్నాయని.. మరో రెండు వేల గుడ్లపై ఏ విధమైన స్టాంపులు లేవని సీఐ పేర్కొన్నారు. ఆ గుడ్లపై స్టాంపులు తొలగించారా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు. మొత్తం 13 వేల గుడ్లను సీడీపీఓ అధికారులు, పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు.
సీడీపీఓ అధికారిణి గుడ్లను పరిశీలించారు. దీనిపై విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో, పసిపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే గుడ్లు అడ్డదారిలో చేతులు మారుతున్నాయని రిపబ్లికన్ పార్టీ నాయకులు నాగేశ్వరావు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: