రూ.10కోట్ల వ్యయంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సీలేరు నదిపై నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులను మల్కన్‌గిరి కలెక్టర్ విజయ ప్రారంభించారు. పోల్లురు గ్రామంలో వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. మార్చి 22న జరిగే మన్యం కొండ వనదేవత జాతరలో భాగంగా జరిగే అమ్మవారి మంగళస్నానం జరిపే ప్రదేశాన్ని సందర్శించారు.
జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్‌కు చింతూరు ఐటీడీఏ అధికారులు స్వాగతం పలికారు. త్వరితగతిన ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో భోజన సదుపాయం, ప్రాథమిక వైద్య సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఆస్పత్రిలో పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు