రంజాన్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ముస్లిం మత పెద్దలతో అమలాపురం డీఎస్పీ షేక్ బాషా సమావేశం నిర్వహించారు. మసీదుల్లో ప్రార్థనలకు కేవలం ఇద్దరు మత పెద్దలకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మసీదుల్లో నమాజ్, ఇఫ్తార్ విందు, సామూహిక ప్రార్థనలు చేపట్టరాదని తెలిపారు. కేవలం ఐదు పూటలా అజా ఇచ్చుట, ఇఫ్తార్ సమయంలో సైరన్ మోగించేందుకు ఇద్దరు మత పెద్దలకు మాత్రమే మసీదులోకి అనుమతి ఉందన్నారు.
ఇదీ చూడండి: మూలస్థానం అగ్రహారానికి జాతీయ పురస్కారం