ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుంచి ఇంకా వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తున్న కారణంగా 13 వేల క్యూసెక్కులకు పైగా నీటిని క్రిందకు విడిచిపెట్టారు.
ఫలితంగా... కిర్లంపూడి, రాజుపాలెం, గొల్లప్రోలాంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు చుట్టుముట్టింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. 1200 ఎకరాలుకు పైగా వరి నీట మునిగింది. గ్రామాలను ముంచెత్తుతున్న వరద కారణంగా రాకపోకలు స్తంభించాయి.
ఇదీ చదవండి: