మాజీ మాంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రాష్ట్ర కాపు ఐకాస కన్వీనర్ ఆకుల రామకృష్ణ కోరారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఆయన ఇంటి వద్ద కాపు సంఘ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ ఉద్యమం కీలక దశకు చేరిందని ఆకుల రామకృష్ణ అన్నారు. ఈ సమయంలో ఉద్యమ బాధ్యతల నుంచి తప్పుకోరాదని ముద్రగడను కోరారు. ప్రభుత్వం 13నెలలు అయినందున తమ హక్కులను గుర్తు చేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాల విషయంలో గాని నిధుల విషయంలో గాని చాలా నష్టపోయమన్నారు. చిత్తశుద్ధి గల ప్రభుత్వాలు ఉంటే సానుకూలంగా కాపు రిజర్వేషన్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ముద్రగడ తమ నిర్ణయాన్ని పునరాలోచించాలన్నారు.