ETV Bharat / state

"రైతులకు మద్దతు ధర వచ్చేలా చర్యలు"

కష్టపడి పండించే రైతులకు వారి వారి పంటకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌ అన్నారు.

author img

By

Published : Oct 8, 2020, 6:33 AM IST

మాట్లాడుతున్న వ్యవసాయ కమిషనర్
మాట్లాడుతున్న వ్యవసాయ కమిషనర్

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రైతు భరోసా కేంద్రాన్నివ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు కనీస మద్దతు ధరను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. గత ఏడాది సుమారు 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఈ ఏడాది 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. పాడి కొనుగోలు అనేది కొత్తగా కాకపోయినా ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ఖరీఫ్‌ సాగు ముందస్తుగానే వచ్చిందని, అయితే కొన్ని ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. ముఖ్యంగా ఈ క్రాఫ్‌ నమోదు కాకపోవడం వల్ల, అలాగే వర్షాల వల్ల ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులకు సరియైన రీతిలో మద్దతు ధర దక్కలేకపోయిందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో రెండు వేల కొనుగోలు కేంద్రాలలోపు మాత్రమే ఉండేవని, అయితే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలను పెంపుదల చేసినట్లు వివరించారు. గతంలో రైతుల నుంచి ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసేవారని, దీనివల్ల మద్దతు ధర రైతులకు కాకుండా దళారులకు దక్కేదని అన్నారు. ఈ ఖరీఫ్‌లో అటువంటి పరిస్థితులు లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతీ రెండు రైతు భరోసా కేంద్రాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంట చేతికొచ్చే సమయానికి సంబంధిత కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పంట పొలంలోకే వెళ్లి పంటను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద తేమను కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే సమయానికి అవసరమైన సంబంధిత తేమను కొలిచే యంత్రాలను ఉంచుతామని అన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించేందుకు అవసరమైన రవాణా వాహనాలను అధికారులు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, వ్యవసాయ శాఖ జెడి కెఎస్‌వి ప్రసాద్‌, డిడి(ఆర్‌బికె) విటి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

'పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.