ETV Bharat / state

Agitation Continues Against Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఆగని నిరసనల హోరు.. చంద్రబాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు - రాష్ట్రవ్యాప్తంగా ఆగని నిరసనల హోరు

Agitation Continues Against Chandrababu Naidu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. దీక్షలు, ర్యాలీలతో హోరెత్తించారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Agitation_Continues_Against_Chandrababu_Naidu_Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 8:36 AM IST

Agitation Continues Against Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఆగని నిరసనల హోరు.. చంద్రబాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు

Agitation Continues Against Chandrababu Naidu Arrest : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మేముసైతం అంటూ న్యాయవాదులు, ఐటీ నిపుణులు, గృహిణులు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Leaders Agitations Continues Against CBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పోస్ట్ కార్డు ఉద్యమం (Postcard Movement in Dharmavaram) చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రాష్ట్రపతి భవన్‌కు పోస్టుకార్డులు పంపించారు. నంద్యాల రిలే నిరాహార దీక్షలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశం నాయకులు దీక్ష చేశారు. కడపలో T.N.S.F ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి దీక్షా శిబిరంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు.

NRIs Agitation in America on CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ప్రవాసాంధ్రుల నిరసనలు..
TDP Cadre Protest in AP : చంద్రబాబు అక్రమ అరెస్టుపై గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో మ‌హిళ‌లు చేతులకు సంకెళ్లతో నిర‌స‌న‌ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం దీక్షలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో MLA గద్దె రామ్మోహన్ ఆధ్వర్యాన మైనార్టీలు నిరసన దీక్ష చేశారు. T.N.T.U.C నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న బొండా ఉమ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు సారథ్యాన తెలుగుదేశం నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Agitation Continues Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆగ్రహ జ్వాలలు..

తూర్పు గోదావరి జిల్లా పందలపాకలో నిర్వహించిన కాగడల ర్యాలీలో... సైకో పోవాలి- సైకిల్‌ రావాలంటూ తెలుగుదేశం నాయకులు నినాదాలు చేశారు. అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఇంటింటికి వెళ్లి "బాబుతో నేను" అంటూ కరపత్రాలు పంపిణీ చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లా బల్లిపేట మండలం నారాయణపురంలో చంద్రబాబు కోసం చేసిన నిరసన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాజాం మండలంలోని వివిధ గ్రామాల్లో‌ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో మత్స్యకారులతో కలిసి తెలుగుదేశం నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విశాఖ మల్కాపురంలో తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ కాగడాల ర్యాలీ చేసింది. మునగపాకలో గంగాహారతి ఇవ్వడానికి వెళ్తున్న తెలుగుదేశం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనకాపల్లి జిల్లాలో జలదీక్ష చేశారు.

చంద్రబాబుకు మద్దతుగా విదేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కెన్యాలో ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. విజనరీ లీడర్‌ను అరెస్టు దారుణమన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.