తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ఎస్సెట్ మేనేజర్‌గా ఆదేష్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆయన విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఆదేష్‌కుమార్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా 8వేల టన్నుల చమురు ఉత్పత్తి తగ్గిందని తెలిపారు. ఉభయగోదావరి, కృష్ణ జిల్లాల నుంచి ప్రస్తుతం రోజుకు 600 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. కోనసీమలో సహజవాయువు, చమురు లీకేజీలు ఏర్పడకుండా చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాతపైపులు తొలగించి కొత్త పైపులు ఏర్పాటు చేస్తామని ఆదేష్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎంపీ