ఒక వ్యక్తి అదృశ్యమైన సంఘటనపై తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ల్లో కేసు నమోదైంది. జిల్లాలోని అల్లవరం మండలం దేవగుప్తం వాసి చెందిన బండికట్ల వెంకటరమణ వ్యాన్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతని బావ అనిల్ కుమార్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రావులపాలెం బస్‌స్టాండ్‌కు వచ్చాడు. వెంకటరమణ ఊరు వెళ్ళాలని చెప్పడంతో సునీల్ కుమార్ బైక్‌ను పార్క్ చేసేందుకు వెళ్లగా తిరిగి వచ్చేసరికి... అతను కనిపించలేదు. చుట్టుపక్కల బంధువులు వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో.... అతని తమ్ముడు ప్రసన్న కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బుజ్జిబాబు తెలిపారు.
ఇదీ చదవండి: అమరావతి ఉద్యమం.. విధ్వంస పాలనకు వ్యతిరేకం : లోకేశ్