లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితం అవుతున్న పరిస్థితుల్లో.. తూర్పు గోదావరి జిల్లా వాడ్రేవుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు తోచిన సహాయం చేశారు. చెల్లుబోయిన వెంకటేశ్వరరావు అనే తెదేపా నేత లక్ష రూపాయల విలువైన కూరగాయలను గ్రామ ప్రజలందరికీ అందజేశారు. 1000 కుటుంబాలకు కూరగాయలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కోడి గుడ్లతో సహా 12 రకాల కాయగూరలను ప్రజల ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చారు. అతని సహాయానికి అందరూ అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: