ETV Bharat / state

తిరుమలలో డిసెంబర్​లో విశేష పర్వదినాలు ఇవే! - 15న కార్తిక దీపోత్సవం - TIRUMALA FESTIVALS IN DECEMBER

డిసెంబర్​లో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలను ప్రకటించిన టీటీడీ

Tirumala Special Festivals in December
Tirumala Special Festivals in December (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2024, 5:28 PM IST

Tirumala Special Festivals in December : తిరుమలలో కలిగయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. స్వామి రూపాన్ని కనులారా వీక్షించి ధన్యులు అవుతారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారికి ప్రతిరోజూ నిత్య పూజలు, వివిధ సేవలు నిర్వహిస్తారు. విశేష పర్వదినాల్లో శ్రీనివాసుడికి విశేష పూజలు జరుపుతారు. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

డిసెంబర్​లో విశేష పర్వదినాలు :

  • డిసెంబర్ 1న నాలుగో విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం
  • 11న సర్వ ఏకాదశి
  • 12న చక్రతీర్థ ముక్కోటి
  • 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర
  • 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం
  • 15న శ్రీవారి ఆలయంలో కార్తిక దీపోత్సవం
  • 16న ధనుర్మాసారంభం
  • 26న సర్వ ఏకాదశి
  • 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం
  • 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

Tirumala Vaikunta Dwara Darshan 2025 : తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇందులో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 10 నుంచి జనవరి 19 వరకు 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని వివరించింది. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాలు మినహా చంటిపిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్​ఆర్ఐ, ఆర్మీల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

తిరుమలగిరుల్లో ఈ జలం సేవిస్తే జ్ఞానయోగం - శేషగిరుల్లో 66 కోట్ల తీర్థాలు, ఏడు ముక్తిప్రదాలు - tirumala tirupati

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.