ETV Bharat / state

సీతపల్లి వాగులో చిక్కుకుని వ్యక్తి మృతి - a man died with drowned in the sitapalli river

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సాయినగర్​కు చెందిన ఓ వ్యక్తి సీతపల్లి వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. వాగులోని రాళ్ల మధ్య ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయదశమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వాగులోకి దిగగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

a man died due drowned in the sitapalli river
సీతపల్లి వాగులో వ్యక్తి గల్లంతు.. మృతదేహం లభ్యం
author img

By

Published : Oct 25, 2020, 6:48 PM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విషాదం నెలకొంది. స్థానిక సాయినగర్​కు చెందిన పసల సూర్యప్రభాస్కర రావు.. విజయదశమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో దిగాడు. అయితే వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల అతను కొట్టుకుపోయి... కిలోమీటర్ దూరంలో ఉన్న రాళ్ల మధ్య చిక్కుకున్నాడు. మధ్యాహ్నం వాగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే మృతుడు వాగులోకి దిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇంటిపెద్ద మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చూడండి:

మహిళ వాలంటీర్ అదృశ్యం...8 మందిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.