తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అరుదైన సంఘటన జరిగింది. ఓ ఆవు 15.5 అంగుళాలు ఉన్న అరుదైన బుల్లి దూడకు జన్మనిచ్చింది. చెంగు చెంగున గంతులెేస్తున్న బుజ్జి దూడను చూడడానికి చుట్టుపక్కల రైతులు తరలివస్తున్నారు. దాంతో అక్కడ సందడి నెలకొంది.
పుంగనూరు రకానికి చెందిన ఆవు దూడలు సహజంగా అతి చిన్నవిగా ఉంటాయి. 18 అంగుళాల నుంచి 24 అంగుళాలు దూడలకు జన్మనిస్తాయి.
కాశీ చారిట్రబుల్ ట్రస్టు నిర్వాహకుడు, ఆయుర్వేద వైద్యుడు రౌతు కాశీ ఈశ్వరరావు ఇంటి వద్ద ఒంగోలు ఆవుకు ఈ దూడ జన్మించింది. ఇప్పటివరకూ ఈ ఆవు అయిదు ఈతలు ఈనగా అవి గిత్తలు. కాగా ఆరవ ఈత పుంగనూరు జాతికి చెందిన దూడ పుట్టిందని ఈ దూడకు ఆయన తల్లిపేరైన ధనలక్ష్మీగా నామకరణం చేసినట్టు ఈశ్వరరావు తెలిపారు.
ఒంగోలు ఆవును పంగనూరు గిత్తతో సంక్రమింపజేయడం వలన ఈ దూడ పుట్టిందని రావులపాలెం పశువైద్యసంపర్ధన శాఖ ఏడీ పి.నాగమణి అన్నారు. ఇటువంటివి అరుదుగా జరుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: 'అతిచిన్న ఆవు'తో ఆ దేశానికి తిప్పలు