తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందిన 44 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తూ.. బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. రాజమహేంద్రవరంలో పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి 2 రోజుల పాటు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులోని బంధువుల ఇంట్లో ఉన్నట్టు కాంటాక్ట్ లిస్ట్ ద్వారా గుర్తించారు. వారందరినీ ప్రత్యేక వాహనాల్లో బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించినట్లు తహసీల్దార్ వెంకటేశ్వరి తెలిపారు.
ఇదీ చూడండి: