కరోనా వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, జంతు ప్రదర్శనశాలలు మూతపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు, విద్యాసంస్థలు, కళాశాలలు, థియేటర్లు, బార్లు, పార్కులు అన్నింటిని మూసివేశారు. జూపార్కు సందర్శన కోసం వచ్చామని... ముందస్తు సమాచారం ఇవ్వకుండా పార్కు మూసేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం మూసివేత