ఎన్నో అంచనాల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా మళ్లీ వైవీ.సుబ్బారెడ్డికే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తిరుమలలోని బంగారు వాకిలి వద్ద సుబ్బారెడ్డితో తితిదే ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. జూన్ 22తో సుబ్బారెడ్డి రెండేళ్ల ఛైర్మన్ పదవి కాలం ముగిసిపోవడంతో ఎవరిని తితిదే ఛైర్మన్‌గా నియమిస్తారనే ప్రశ్న తలెత్తింది. మళ్లీ సుబ్బారెడ్డికే పట్టం కడతారనే అంచనాలను నిజం చేస్తూ నెలన్నర తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నేడు ఆయన బాధ్యతలు స్యీకరించారు.
ఇదీ చదవండి : వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై అసహనం