చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో.. అధికార పార్టీ నేతలు అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులను భయాందోళనలకు గురి చేశారు. తాము సూచించిన వ్యక్తినే ఎన్నుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆందోళనకు గురైన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైకాపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు దారి ఇచ్చే ప్రసక్తే లేదంటూ.. పోలీసు వాహనాలు ఎదురుగా గ్రామస్తులు బైఠాయించారు. ఉన్నతాధికారులు అక్కడకు చేరుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 2,723 పంచాయతీల్లో పోలింగ్...ఎన్నికల్లో తొలిసారి నోటా: జీకే ద్వివేది