చిత్తూరు జిల్లా ములకలచెరువు ఎంపీడీవోను వైకాపా నేతలు బూతులు తిట్టారు. తాము చెప్పిన వారినే వాలంటీర్లుగా నియమించాలని... స్థానిక వైకాపా నేతలు మాధవరెడ్డి, మోహనరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని ఎంపీడీవో రమేశ్ బాబు ఆరోపించారు. తన కారును అడ్డగించి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇదీ చూడండి: వైకాపాలో గుర్తింపు లేదని...సెల్ టవర్ ఎక్కిన కార్యకర్త