చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి జరిగింది. ఈ దాడుల్లో ఇద్దరు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 5 వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇదీ జరిగింది..
తంబళ్లపల్లె నియోజవర్గంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు... రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కిశోర్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు నేతలు మదనపల్లె నుంచి బయలుదేరారు. తెదేపా నేతల వాహనశ్రేణి కురుబలకోట మండలం అంగళ్లు గ్రామానికి చేరుకోగానే వైకాపా కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఐదు వాహనాల ధ్వసం అయ్యాయి. ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఠాణాకు సమీపంలోనే..
పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలోనే తాము ప్రయాణిస్తున్న వాహనాలపై దాడులు జరుగుతున్నా... పోలీసులు పట్టించుకోలేదని తెదేపా నేతలు ఆరోపించారు. తమపై దాడికి పాల్పడిన వైకాపా నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ... సంఘటన జరిగిన ప్రాంతంలోనే బైఠాయించారు. వైకాపా కార్యకర్తలు... తెదేపా నేతల నినాదాలతో అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
శ్రేణుల మద్దతు..
ఆందోళనకు దిగిన తెదేపా నేతలకు మద్దుతుగా తంబళ్లపల్లె నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తెదేపా శ్రేణులు అంగళ్లుకు చేరుకున్నారు. తమపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసేంత వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి... ఆందోళన చేస్తున్న శ్రీనివాసరెడ్డి, కిశోర్‌కుమార్‌రెడ్డి, శంకర్‌యాదవ్, దొమ్మాలపాటి రమేష్‌తో పాటు నేతలు, కార్యకర్తలు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. లారీలోకి ఎక్కించి వాల్మీకిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండీ... అంగళ్లలో ఉద్రిక్తత...తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి