చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కస్పున్నీసా అనే గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. తహసీల్దార్ కార్యాలయం పైనుంచి దూకింది. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలు తస్మున్నీసా బి.కొత్తకోట బీసీ కాలనీలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుంచి సమాధానం లేకపోవడం, ప్రతిపాదిత లబ్ధిదారులు ప్రశ్నిస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం.
ఇదీ చదవండి
పాప కిడ్నాప్.. 5 గంటల్లో తల్లిదండ్రుల ఒడికి చేర్చిన పోలీసులు