సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఉన్న చోటునే ఉంటూ ఉపాధి పొందుతున్నారు.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని మహిళలు. షేడ్‌నెట్, పాలిహౌస్ లాంటి ఆధునిక పద్ధతులతో చామంతి, బంతిపూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. దాంతోపాటు నాణ్యమైన విత్తన మొక్కల నర్సరీలను పెంచుతూ మెరుగైన ఆదాయం ఆర్జిస్తున్నారు. మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు.
మండలంలోని గాంధీపురం, గంధపొడివారిపల్లె, రాచరంగయ్యపల్లె, రాజాఇండ్లు, గోపాలపురం, గొబ్బిళ్లమిట్ట గ్రామాల్లోని మహిళలు పూలమొక్కల సాగుతో నిరంతర ఆదాయం పొందుతున్నారు. పూలసాగు, నర్సరీ మొక్కల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్నారు. స్థానిక వాతావరణానికి తగ్గట్లు అధిక దిగుబడులు ఇచ్చే ఆరేడు రకాల పూలమొక్కలు సాగు చేస్తున్నారు. వీటిని పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మొక్కలను కత్తిరించి అంటు కట్టడం, ట్రేలలో కోకోపిట్ నింపడం, కలుపు తీయండ వంటి పనులతో మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు.
సాధారణంగా కొన్ని సీజన్లలో మాత్రమే వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి. పంటల్లోనూ నిర్దిష్ట సమయానికే డబ్బు వస్తుంది. అయితే ఈ పూలమొక్కల సాగుతో ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ మహిళామణులు.
ఇవీ చదవండి..